World Cup 2024: ఆర్చరీ వరల్డ్ కప్ 2024లో భారత ఆర్చర్లు సత్తా చాటారు. మహిళల టీం, పురుషుల టీం, మిక్స్డ్ టీమ్‌ల వారు ఫైనల్లో విజయాలు సాధించి భారత్‌కు మూడు స్వర్ణాలు తెచ్చి పెట్టారు. దేశం గర్వ పడేలా తమ ప్రదర్శనతో అందరినీ అబ్బురపరిచారు. ఆర్చరీ ప్రపంచ కప్ 2024(ARCHERY WORLD CUP 2024) స్టేజ్1 ఫైనల్స్‌లో శనివారం మన మహిళల టీమ్ ప్రణీత్ కౌర్, అదితి స్వామి, జ్యోతి సురేఖలు ఇటలీ టీంతో తలపడి గెలిచారు. 236-225 పాయింట్ల తేడాతో నెగ్గి పసిడిని పట్టేశారు.
మన మెన్స్ టీం ఆర్చర్లైన ప్రథమేష్, ప్రయాంశ్, అభిషేక్ వర్మలు ఫైనల్స్‌లో నెదర్లాండ్స్ టీంతో పోటీ పడ్డారు. 238-231 పాయింట్ల తేడాతో అపోజిషన్ టీంని ఓడించి పసిడిని పట్టేశారు. మరోవైపు మిక్స్టీంలో ఆర్చర్లుగా ఉన్న అభిషస్త్రక్ వర్మ, జ్యోతి సురేఖలు కూడా ఎస్తోనియా టీంతో తలపడి స్వల్ప తేడాతో విజయం సాధించింది. 158-157 పాయింట్ల తేడాతో పసిడిని కొట్టేసింది.