తిరుపతి జిల్లాలో ప్రైవేట్ లా కళాశాలలు విద్యార్థుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని SVU విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా VC నర్సింగరావుకు వినతి పత్రం అందజేశారు. కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కంటే రెండింతలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
KDP: జిల్లాలో పదో తరగతి పరీక్షల సందర్భంగా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరగేందుకు కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు ఫ్రిస్కింగ్ నిర్వహిస్తున్నారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం విధించారు.
ప్రకాశం: పొన్నలూరు పోలీస్ స్టేషన్‌ను DSP సత్యనారాయణ పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరగా న్యాయం అందించాలని సూచించారు. స్టేషన్ నిర్వాహణలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉంచాలని ఎస్సైకి చెప్పారు. విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు.
E.G: పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్. కాంతారావును మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి బుధవారం రాజమండ్రిలో కలిశారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పోలవరం ప్రాజెక్ట్ పనులను శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. RRR, PMKSY, ఫ్లడ్ మానేజ్‌మెంట్ పనులకు సహకరిస్తామని వెల్లడించారు.
TPT: కమిషనర్ మౌర్య తిరుపతి నగరంలోని పలు ప్రదేశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొర్లగుంటలో పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, కాలువల నిర్వహణ ఎలా జరుగుతుందో స్థానిక పౌరులను అడిగి తెలుసుకున్నారు. తడి చెత్త, పొడి చెత్త గురించి వివరించారు. చెత్త సేకరణకు సిబ్బంది ఏ సమయంలో వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
W.G: యుద్ధం నేపథ్యంలో పెట్రోలు కొరత ఏర్పడుతుందనే ఊహాగానాలతో ఆకివీడులో బుధవారం ఉదయం నుంచి బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టారు. ఎవరికి వారే వాహనాలను బంకుల వద్ద ఉంచి ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు. మరికొందరు బాటిళ్లు, డబ్బాల్లో నిల్వ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ పరిణామంతో పెట్రోలు బంకుల వద్ద తీవ్రమైన రద్దీ నెలకొంది.
CTR: నగరి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరాహార దీక్ష చేపట్టారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని UTF సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఒకరోజు దీక్షలో భాగంగా వారు 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని కోరారు. అలాగే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం బార్ లైసెన్స్ కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. ధర్మవరం టౌన్‌లో నోటిఫై చేసిన ఓ బార్ కోసం ముగ్గురు దరఖాస్తుదారుల నుంచి నాలుగు దరఖాస్తులు అందాయి. ఎక్సైజ్ అధికారి గోవింద నాయక్ సమక్షంలో నిర్వహించిన లాటరీలో ఆర్. రవికుమార్ విజేతగా నిలిచారు.
SS: మంత్రి సత్యకుమార్ బుధవారం ఢిల్లీలో పర్యటిస్తూ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. భవ్య పథకం కింద రాష్ట్రానికి మరిన్ని పారిశ్రామిక పార్కులు మంజూరు చేయాలని, ముదిగుబ్బ మండలానికి ప్రత్యేకంగా ఒక పార్క్ కేటాయించాలని కోరారు. బత్తలపల్లికి కృషి విజ్ఞాన కేంద్రం, రాష్ట్రానికి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మంజూరు చేయాలని విన్నవించారు.
కోనసీమ: అయినవిల్లి మండలం పోతుకుర్రు గ్రామాన్ని ప్రభుత్వ క్షయ వ్యాధి రహిత గ్రామంగా గుర్తించినట్లు గ్రామ సర్పంచ్ సయ్యపురాజు సుబ్బలక్ష్మి తెలిపారు. అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దుర్గారావు దొర చేతుల మీదుగా మంగళవారం అవార్డు తీసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. స్థానిక వైద్య సిబ్బందిని సర్పంచ్, వైద్యాధికారులు అభినందించారు.
ATP: గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన భీమన్నగారి వెంకటేష్ కుమార్తె వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి బుధవారం రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం సంతోషకరమని, నూతన వధూవరులు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
PLD: ఈపూరు మండలం గుండెపల్లిలో అంగన్వాడీ కేంద్రం పరిస్థితి దారుణంగా మారింది. సొంత భవనం లేక పాత పాఠశాల భవనంలో విదులు నిర్వహిస్తుండగా, పైకప్పు పెంకులు, చెక్క ముక్కలు పడడంతో, చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు వణికిపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సురక్షితమైన భవనాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లాలో పదవ తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా తిరిగే వారిని గుర్తించి కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది. కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ షాపులు మూసివేయాలని ఆదేశించారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ ధీరజ్ తెలిపారు.
SKLM: పోలాకి(మం) గంటపేట గ్రామంలో రామాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. బుధవారం గ్రామస్తుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు వైసీపీ నాయకులు ఉన్నారు.
KKD: పేదల భూములపై టీడీపీ నేతల కన్నుపడిందని తోట నరసింహం అన్నారు. జగ్గంపేటలో డ్రైవర్స్ కాలనీ స్ధలాల కబ్జాకు టీడీపీ నేతలు యత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2010లో అప్పటి మంత్రిగా ఉన్న తాను సర్వే నంబర్ 196/2లో సుమారు 200 పేద కుటుంబాలకు ఇళ్ళ పట్టాల పంపిణీ చేశానన్నారు. బాధితులతో కలిసి నరసింహం కలెక్టర్ షాన్ మోహన్‌కు ఫిర్యాదు చేశారు.