VZM: రేగిడి మండల వెటర్నరీ డాక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక వన్నలిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పశు వైద్య సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా గాలికుంటు వ్యాధి టీకాల కోసం అవగాహనా, వ్యాధి లక్షణాలు, చికిత్స రైతులకు వెటర్నరీ అసిస్టెంట్ నరసింహులు, సర్పంచ్ గార రమణ తెలియజేశారు.
PPM: మహిళలు బస్సు ప్రయాణాలు చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని శక్తి టీమ్ హెడ్ కానిస్టేబుల్ సీతయ్య తెలిపారు. బుధవారం సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మెడలో బంగారు ఆభరణాలు కప్పుకోవాలని కోరారు. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క మహిళ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఆపద సమయంలో ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేయాలని చెప్పుకొచ్చారు.
SKLM: ఆమదాలవలస పట్టణంలోని శ్రీ దేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు, భక్తులు, పోలీసుల సమక్షంలో హుండీని తెరిచి లెక్కించగా మొత్తం రూ. 1,49,320 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సీహెచ్ ప్రభాకర్ రావు మంగళవారం తెలిపారు.
అన్నమయ్య: ఎర్రచందనం స్మగ్లర్ బుక్కే లక్ష్మీనారాయణ నాయక్ మంగళవారం తిరుపతి RSS JFCM కోర్టులో స్వచ్ఛందంగా లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. మెజిస్ట్రేట్ అతనికి రిమాండ్ విధించి పీలేరు జైలుకు తరలించారు. నందలూరు, రాజంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతనిపై నాలుగు కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర నగరంలో మార్నింగ్ విజిట్ నిర్వహించి ప్రధాన రహదారుల పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక బృందాలతో కలిసి శుభ్రత పనులను పర్యవేక్షించారు. క్లాప్ వాహనాల ద్వారా చెత్త సేకరణ విధానాన్ని తనిఖీ చేసి, సమయానికి చెత్త తరలించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ATP: నార్పల మండలం గూగూడు కుళ్లాయి స్వామి ఆలయ హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. గత 10 నెలలకు గాను రూ. 28.11 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శోభ వెల్లడించారు. నగదుతో పాటు 17 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి వస్తువులను భక్తులు కానుకలుగా సమర్పించారు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తి చేశారు.
ASR: అరకు(మం) మాదల పంచాయతీ దాబుగూడ నుంచి కమలతోట వెళ్లే రహదారి నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆదివాసీ గిరిజన సంఘం అరకు మండల కమిటీ సభ్యుడు కుమిడి రమేష్ డిమాండ్ చేశారు. ఆయా గ్రామాలకు ఇప్పటికే రహదారి మంజూరైన నిర్మాణం ప్రారంభించలేదని మండిపడ్డారు. రహదారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.
GNTR: పొన్నూరులో ముస్లింల సంక్షేమం కోసం ఏర్పడిన అంజుమన్ కమిటీ, హామీలు నెరవేర్చలేకపోయిందని 28వ వార్డు డైరెక్టర్ సయ్యద్ జానీ భాష విమర్శించారు. ఏడాది కాలంగా పేదలు, వితంతువులకు సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీ పని తీరు నచ్చక తన డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముస్లిం సమాజానికి న్యాయం చేయాలని కమిటీకి సూచించారు.
SS: మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ధర్మవరం మున్సిపాలిటీలో జరుగుతున్న మాస్టర్ తనిఖీలో నియోజకవర్గ ఇంఛార్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు. కొత్తపేట అండర్ బ్రిడ్జి వద్ద కాలువల పూడికతీత పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కోనసీమ: మహిళలకు ఉపాధి కల్పించడంలో భాగంగా సముద్రపు నాచు పెంపకానికి కార్యాచరణ రూపొందించాలని జేసీ నిశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో శాస్త్రవేత్తలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మత్స్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో 5 గ్రామాల చొప్పున ఎంపిక చేసి 20 క్లస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రకాశం: ఒంగోలు నగరంలో ఇప్పటివరకు 50 డివిజన్లు ఉండగా 66కు పెరగనున్నట్లు తెలుస్తుంది. వార్డులు, డివిజన్ల పునర్విభజనపై ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలు కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత జనాభా 3.10 లక్షల మందిగా ఉన్నారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం ఆ సంఖ్య పెరగనుంది. దీంతో ఒంగోలును 66 డివిజన్లుగా పునర్విభజించనున్నారు.
కృష్ణా: పెనమలూరు మండలం పోరంకి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో ఆర్సిలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న భారీ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రమంత్రి కుమారస్వామి శంకుస్థాపన చేయటం శుభపరిణామమని అన్నారు. రూ.1,35964 కోట్లతో ఈ కర్మాగారాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు.
SKLM: ఆయా శాఖల్లో ఎస్సీ రోస్టర్ పాయింట్ తప్పనిసరిగా అమలు జరగాలని రాష్ట్ర ఎస్సీ కమీషన్ సభ్యులు రావాడ సీతారాం అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, ఐఐఐటీ, మున్సిపల్ కార్పొరేషన్, డా.బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తదితర శాఖల అధికారులతో ఆయన ఎస్సీ రోస్టర్ పాయింట్ అమలుపై మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో సమీక్షించారు.
SS: భారతీయ కళలు, మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ శిల్పారామం క్యాలెండర్‌ను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి బుధవారం ఆవిష్కరించారు. రాష్ట్ర సంస్కృతిని కాపాడటంలో శిల్పారామం పాత్ర కీలకమని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల వారసత్వ సంపదను భావి తరాలకు అందించేలా ఈ క్యాలెండర్ రూపకల్పన చేశారని అన్నారు.
ATP: తాడిపత్రిలోని చారిత్రక బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తి నినాదాలతో మారుమోగింది.