అన్ని విషయాలపై స్పందించే పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కారణంగా అంత మంది ప్రాణాలు కోల్పోతే ఎందుకు స్పందించడం లేదని మంత్రి రోజా ప్నశ్నించారరు. సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించిన ఆమె… చంద్రబాబు, పవన్ లపై విమర్శలు కురిపించారు. జగన్ ముఖ్యమంత్రి అవటం రాష్ట్రం అదృష్టమని ప్రజలు అనుకుంటున్నారని రోజా తెలిపారు. గత ఏడాదిలో చంద్రబాబు పనికి మాలిన పాత్ర పోషించాడని విమర్శించారు. జగన్ను తిట్టడానికే, చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాడని రోజా విమర్శించారు.
దత్త పుత్రుడు రెండు చోట్లా ఓడిపోయాడని, చంద్రబాబు చంకలో కూర్చోవటం మినహా దత్త పుత్రుడికి మరో పనిలేదని రోజా విమర్శించారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వ్యతిరేకి అని రోజా మండిపడ్డారు.
కందుకూరులో 8 మందిని, గుంటూరులో ముగ్గురు చంద్రబాబు వల్ల చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. 2022 ఏడాది ముగింపులో 8 మందిని.. 2023 ప్రారంభంలో ముగ్గురిని చంద్రబాబు చంపాడని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు 40 మంది ప్రాణాలు తీశాడని రోజా విమర్శించారు. రాత్రి పూట డ్రోన్ షాట్ల కోసం సందుగొందుల్లో సభలు పెడుతున్నాడని రోజా మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా మిగిలిన పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదని రోజా ఫైర్ అయ్యారు.
లోకేష్ పాదయాత్ర డైవర్ట్ చేయటానికే వైసీపీ నేతలు ఇది చేశారని టీడీపీ నాయకులు అంటున్నారని, టీడీపీ నేతలు అన్నం తింటున్నారా? ఇంకేమైనా తింటున్నారా అని రోజా మండిపడ్డారు.