తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి అంకురార్పణ చేశారు. ఆయన పార్టీ పెట్టడాన్ని కొందరు స్వాగతిస్తుంటే.. కొందరు విమర్శిస్తున్నారు. తెలంగాణనలో ప్రతిపక్ష పార్టీలన్నీ… ఈ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నవారే.. కాగా.. తాజాగా… ఈ పార్టీ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా స్పందించారు.
టిఆర్ఎస్, బిఆర్ఎస్ పార్టీకి మార్చుకోవటం వాళ్ల ఇష్టం అని బొత్స సత్యానారాయణ పేర్కొన్నారు. ఏపీలో ఉన్న అనేక పార్టీలలో బిఆర్ఎస్ పార్టీ ఒకటి అవుతుంది.. అంతే అని ఆయన అన్నారు. ఇక ఎంత మంది పోటీలో ఉంటే అంత మంచిదే అని, మాపై బిఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏమీ ఉండదని తేల్చి చెప్పేశారు.
ఇదిలా ఉండగా.. అమరావతి రైతుల పాదయాత్ర పై మంత్రి బొత్స మరోసారి ఫైర్ అయ్యారు. రైతుల ముసుగులో టీడీపీ, రియల్ ఎస్టేట్ దోపిడీదారులు చేస్తుందే అమరావతి పాదయాత్ర అని అన్నారు. అసలు ఏమి ఉద్ధరించడానికి ఈ పాదయాత్ర చేస్తున్నారు అని ప్రశ్నించిన ఆయన అసలు వారికి మేం ఎందుకు సహకరించాలి? అని ప్రశ్నించారు.
అమరావతి భూములను టిడిపి నాయకులు దోచుకున్నారని, టీడీపీ నాయకులు ఎంత దోచుకున్నారో శాసనసభ సాక్షిగా వెల్లడించామని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పై టీడీపీతో చర్చకు సిద్ధం అయ్యామని చెప్పారు.