KKD: కరప ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. కరప మండల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు రూ.151 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మెడికల్, సివిల్ సప్లైస్, మధ్యాహ్న భోజన పథకాల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జూన్లో ఐడీ కార్డులు ఇస్తామన్నారు.