AKP: రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ఎంతోమంది క్షతగాత్రులకు ప్రాణదాతలుగా మారే అవకాశం లభిస్తుందని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద సీఐ జే.మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదానం చేయడం చాలా మంచి కార్యక్రమమని డీఎస్పీ చెప్పారు.