TPT: టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ (BIRRD) హాస్పిటల్ నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికగా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు TTD ప్రకటనలో పేర్కొంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్ మొదలైన 9 విభాగాల్లో మొత్తం 30 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.tirumala.org/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.