CTR: పుంగునూరులో మంగళ, బుధవారాలలో సుగుటూరు గంగ జాతర అత్యంత వైభవంగా జరగనుంది. జాతరను తిలకించేందుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరానున్నారు. జాతరలో భాగంగా ఇవాళ రాత్రి జమీందారు ప్యాలస్‌లో అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పట్టణంలో ఊరేగించనున్నారు. బుధవారం ఉదయం నుంచి ఆలయంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తారు.