KRNL: సీ.బెళగల్ ప్రతి గ్రామంలో తప్పనిసరిగా 100 శాతం ఇంటి పన్నుల లక్ష్యాలను పూర్తిచేయాలని సీ.బెళగల్ ఎంపీడీవో రాణెమ్మ అన్నారు. శనివారం మండల పరిధిలోని కంబదహాల్లో జరుగుతున్న ఇంటి పన్నుల చెల్లింపు కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆమె ప్రజలను కోరారు.