PLD: నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో గురువారం పోలీసులు భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ, ట్రైనీ ఐపీఎస్, ట్రైనీ డీఎస్పీ నేతృత్వంలో సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సోదా చేసి, సరైన పత్రాలు లేని 48 ద్విచక్ర వాహనాలు మరియు కొన్ని మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.