కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వచ్చే రెండు రోజుల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరే అవకాశముందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారం కౌతాళం, పెద్దకడుబూరులో వరుసగా 39.4, 39.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.