ATP: గ్రామ స్వచ్ఛ భారత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని CITU గుంతకల్లు పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు పేర్కొన్నారు. గురువారం కార్మికులతో ఆయన సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికులపై అమలు చేస్తున్న మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ప్రకారం కనీసం రూ. 26,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.