VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్వచ్ఛ వారోత్సవ్ కార్యక్రమాన్ని వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ ప్రారంభించారు. అవుట్గేట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఆచార్యులతో కలిసి పరిసరాలను శుభ్రపరిచారు. విశ్వవిద్యాలయాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారులు, అధ్యాపకులు పాల్గొని స్వచ్ఛతపై అవగాహన కల్పించారు.