GNTR: జిల్లాలో ఉల్లాస్ అక్షర ఆంధ్రా పరీక్షలు మార్చి 15న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లాలో మొత్తం 1485 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్ష 150 మార్కులకు నిర్వహించబడుతుంది. ఇందులో చదవడం, రాయడం, అంకెల పరిజ్ఞానం అంశాలపై ప్రశ్నలు ఉంటాయన్నారు.