W.G: భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. డ్వాక్రా మహిళల జీతాల బకాయిలు, పాస్ పోర్ట్ సమస్యలు, ముత్యాలపల్లి హైస్కూల్ వద్ద డివైడర్ల ఏర్పాటు వంటి అంశాలపై ప్రజలు మంత్రికి విజ్ఞప్తి చేశారు.