NDL: విజయవాడ పిన్నమనేని సిద్ధార్థ కాలేజీ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద శనివారం సాయంత్రం లారీ ఢీకొని వృద్ధ దంపతులు గాయపడ్డారు. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెంటనే స్పందించి, కాన్వాయ్ ఆపి బాధితులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి సిబ్బందితో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.