కర్నూలు: జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఏ.సిరి సూచించారు. తాగునీరు, చలివేంద్రాలు, నీడ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఎండలో పని చేయవద్దన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. వడదెబ్బల చికిత్సకు వైద్యశాఖ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.