SKLM: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో బదిలీలకు సంబంధించిన ఫైళ్లు మాయం అవటంతో గందరగోళం నెలకొంది. ఇటీవల వివాదాలకు అడ్డాగా మారిన ఈ కార్యాలయం పనితీరుపై ఎస్టీ కమిషన్ ఇటీవల విచారణ జరిపి సిబ్బంది పనితీరుపై మొట్టికాయలు వేసింది. ఇంత జరిగినా… బదిలీల ఫైళ్లు మాయం అవటం, ఆ విషయంలో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకపోవటంతో అనేక అనుమానలు వ్యక్తం అవుతున్నాయి.