KDP: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వనాథ్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో నిబంధనలు అతిక్రమించిన 201 మందిపై కేసులు నమోదు చేసి రూ.47,530ల జరిమానా విధించినట్లు తెలిపారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.