రైల్వే కోడూరులో విద్యార్థుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారు. శుక్రవారం పాఠశాలలకు వచ్చే చిన్నారులు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు చర్యగా ప్రతిరోజూ ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం పాఠశాల సమయాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ విద్యార్థులు సురక్షితంగా రోడ్డు దాటేలా సహాయం చేస్తున్నారు.