అనంతపురంలో RTIH ఆధ్వర్యంలో ‘ఇగ్నైట్’ నైపుణ్యాభివృద్ధి శిక్షణను విభిన్న ప్రతిభావంతుల సంస్థ ఛైర్మన్ గడుపూటి నారాయణస్వామి మంగళవారం ప్రారంభించారు. ‘ఒక కుటుంబం–ఒక వ్యాపారవేత్త’ పథకంలో భాగంగా దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతుందని తెలిపారు.