ASR: క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అనంతగిరి ఎంపీపీ తెడబారికి మితుల పేర్కొన్నారు. గిరిజన యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని, క్రీడల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. బుధవారం అనంతగిరి మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ దిగువబూడి గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా క్రికెట్ టోర్నమెంట్ను సర్పంచ్ అప్పారావుతో కలిసి ఎంపీపీ ప్రారంభించారు.