KKD: సామర్లకోటలో అక్క లక్ష్మీదేవి అనే మహిళ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. గండేటి సాయి, పెద్దింటి కిరణ్ కుమార్ అనే నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ కృష్ణ భగవాన్ మంగళవారం వెల్లడించారు. మార్చి 23న జరిగిన ఈ ఘటనపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నాయని పేర్కొన్నారు.