TPT: రైతులు పూర్తిగా పక్వానికి వచ్చిన మామిడికాయలను మాత్రమే కోయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సూచించారు. మే 25 తర్వాత జిల్లాలోని అన్ని గుజ్జు పరిశ్రమలు ప్రారంభమవుతాయని తెలిపారు. మామిడి కాయలను దఫాల వారీగా కోయడం వల్ల మార్కెట్లో ధరలు స్థిరంగా ఉండటంతో పాటు రైతులకు మంచి లాభాలు వస్తాయని పేర్కొన్నారు.