విశాఖలోని ICAR-CMFRI రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో గిరిజనులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మత్స్య సంపద ద్వారా ఆదాయం పెంపు, జలాశయాలు–చెరువుల శాస్త్రీయ వినియోగంపై శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. ముఖ్యంగా మత్స్య సంపద, ఆక్వాకల్చర్ అభివృద్ధికి అవసరమైన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.