గుంటూరులో జిల్లా చెస్ అసోసియేషన్, రవీంద్రరాజు చెస్ అకాడమీ సంయుక్తంగా అండర్-7 బాలబాలికల చెస్ పోటీలు గురువారం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు చల్లా రవీంద్రరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 2019, జనవరి 1 తర్వాత జన్మించినవారు అర్హులన్నారు. పోటీ వివరాల కోసం చల్లా రవీంద్రరాజు (98490 09999)ను సంప్రదించాలని ఆయన సూచించారు.