ATP: గుంతకల్లు మండలంలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ఆగమ సలహాదారుల సూచనల మేరకు పాత ఆలయాన్ని తొలగించి, కొత్త రాతి నిర్మాణ పనులు చేపట్టామని వివరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.