కోనసీమ: ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని సహజ యోగ ధ్యాన కేంద్రం స్టేట్ కో-ఆర్డినేటర్ రామకృష్ణ పేర్కొన్నారు. అమలాపురంలో నూతన సహజ యోగ ధ్యాన కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. 1970 లో నిర్మల దేవి సహజ యోగ కేంద్రాన్ని స్థాపించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ధ్యానం ప్రసిద్ధి చెందిందని, అందరూ ధ్యానం చేయాలన్నారు.