VSP: 2026-27 లక్ష్యాల సాధనలో యంగ్ ప్రొఫెషనల్స్ కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సేవల నాణ్యత KPIల మెరుగుదల, ప్రజాభిప్రాయాల ఆధారంగా సేవల అభివృద్ధి, PGRS ఫిర్యాదుల వేగవంత పరిష్కారం, గ్రామ-వార్డు సచివాలయాలతో సమన్వయం, కమ్యూనిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు.