జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించాడు. చంద్రబాబు… కర్నూలు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటన నిన్నటితో ముగిసింది. కాగా… ఈ సందర్భంగా… చంద్రబాబు…. జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఓడిపోతామనే భయంతో పిరికితనంతో సీఎం జగన్ మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. జగన్ రాయలసీమ ద్రోహి అని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో చివరి రోజున చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేసారు.
రాయలసీమకు ఎవరేం చేశారో చర్చించడానికి తాను సిద్ధమని అన్నారు. ఎవడ్రా రాయలసీమ ద్రోహి… పనికిమాలిన దద్దమ్మల్లారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనే సీమ ద్రోహి అని అన్నారు. రాయలసీమను దోచుకునే శక్తి వైసీపీకి ఉందని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే శక్తి టీడీపీకే ఉందని చంద్రబాబు వివరించారు. రాయలసీమను తాము రతనాల సీమ చేస్తే జగన్ రెడ్డి రాయలసీమకు ద్రోహం తల పెట్టాడని చంద్రబాబు విమర్శించారు.
ప్రాంత ప్రాంతాలకు వెళ్లి మతాలకు, కులాలకు చిచ్చుపెట్టి చలికాచుకునే నువ్వు రాజకీయం చేస్తావా? ఇదేం పులివెందుల అనుకుంటున్నావా… తరిమి తరిమి కొట్టిస్తా. వైసీపీ గూండాలు ఒకటే గుర్తుపెట్టుకోండి… బట్టలిప్పి కొట్టిస్తా. మర్యాదకు మర్యాద… దెబ్బకు దెబ్బ. ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలైనా ఇస్తా. బాంబులకే భయపడలేదు. నాపైనే దాడి చేయాలనుకుంటున్నారు… మా కార్యకర్తలకు ఒక మాట చెబితే మీరు చిత్తు చిత్తు అవుతారు అంటూ హెచ్చరించారు.