అన్నమయ్య: ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గ్రామీణాభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం తంబళ్లపల్లి మండలంలో రూ.4.20 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించి, మార్చి 31లోపు నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.