VZM: వంగర మండల కేంద్రంలో సోమవారం నుండి రైతన్న మీకోసం వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు AO కన్నబాబ ఓ ప్రకటనలో తెలిపారు. 16,17,18, 23, 24, 25 తేదీలలో ఈ వారోత్సవాలలో భాగంగా వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహించేందుకు పంచ సూత్రాలపై రైతులకు ఆవగాహన కల్పిస్తామన్నారు. పంటల సాగు విధానాలు, ఎరువుల వినియోగం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలపై సూచనలు చేస్తామన్నారు.