సత్యసాయి జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తిలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో సుమారు 3 వేల మంది మహిళలతో సమావేశం నిర్వహించడంతో పాటు మహిళల జీవనోపాధి కార్యక్రమాలపై ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించాలన్నారు.