AP: విపత్తుల సమయాల్లో విద్యుత్ శాఖ అధికారుల పనితీరు అభినందనీయమని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విజయవాడ విద్యుత్ సౌధలో APSPDCL నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. అందరి కృషి కారణంగానే శాఖకు మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని CM ఆదేశించారని, ఈ మేరకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు.