వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా యవ్వనంగా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర తప్పనిసరి. ఎండలో వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ వాడాలి. ఒత్తిడి తగ్గించుకుని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగి చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.