WGL: గీసుగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో 2023 మార్చి 7న జరిగిన వంశీ మృతి కేసుపై జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్ సత్యశారద విచారణకు ఆదేశించారు. కస్టడీలో ఉండగా వంశీ మరణించాడన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10న ఉదయం 11 గంటలకు వరంగల్ ఆర్డీవో కార్యాలయంలో విచారణ జరగనుంది. కేసుతో సంబంధం ఉన్నవారు, సాక్షులందరూ తప్పనిసరిగా హాజరవ్వాలన్నారు.