WGL: రాయపర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆ పోస్టులో పనిచేసిన అధికారి బదిలీ కావడంతో సర్టిఫికెట్ల కోసం ప్రజలు పలుమార్లు కార్యాలయానికి తిరగాల్సి వస్తోందని అవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అధికారిని నియమాకం చేయాలని ప్రజలు కోరుతున్నారు.