NGKL: కోడేరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బద్రి నాయక్ ఇటీవల ఏఎస్సైగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ బుధవారం బద్రీ నాయక్‌కు స్టార్స్ అలంకరించి అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచి మరిన్ని అవకాశాలు, గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.