W.G: బ్రాహ్మణ చెరువులో ఏఎన్ఎం లక్ష్మి ఆధ్వర్యంలో ‘పోషణ పక్వాడ’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ చేపట్టి చిరుధాన్యాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు. అంగన్వాడీ సూపర్వైజర్ రుతుకుమారి, టీచర్ విజయమ్మ పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్థానికులకు ఆరోగ్య సూత్రాలను వివరించారు.