AKP: మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డిప్యూటీ డీఈవో అప్పారావు సూచించారు. నక్కపల్లిలో గురువారం మండలానికి చెందిన మధ్యాహ్న భోజన నిర్వాహకులకు నిర్వహించిన శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. భోజనం శుభ్రంగా రుచిగా ఉండాలన్నారు తప్పనిసరిగా నాణ్యత పాటించాలన్నారు. మెనూ అమలు చేయాలన్నారు.