ATP: రాప్తాడు నియోజకవర్గం పాపంపేటలో ఈనెల 12న నిర్వహించనున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల పోస్టర్లను ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం ఆవిష్కరించారు. HYD బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్య బృందం ఈ శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఖరీదైన పరీక్షలను మన ప్రాంతంలోనే ఉచితంగా అందిస్తున్నందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.