CTR: విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం సోమవారం నుంచి పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాలని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం రాగిజావా, మధ్యాహ్న భోజనం యధా విధిగా అందుతుందని పేర్కొన్నారు.