PPM: అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వ నిర్దేశిత మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని DMHO డాక్టర్ ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల పరిశీలనలో భాగంగా జిల్లా ఎన్.సి.డి అధికారి డా. టి. జగన్ మోహనరావుతో కలిసి గురువారం పట్టణంలోని హాస్పిటల్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.