NLR: పొదలకూరు మండలం మరుపూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రదీప్ (14) అనే బాలుడు ఆదివారం రాత్రి ఈత కొట్టడానికి వెళ్లి పాత తాగునీటి బావిలో మునిగి మృతి చెందాడు. సుమారు 25 అడుగుల లోతు ఉన్న బావిలో డైవింగ్ చేసిన తర్వాత పైకి రాకపోవడంతో గ్రామస్థులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని వెలికితీశారు.