కృష్ణా: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై సందీప్ వాహనదారులకు సూచించారు. మంగళవారం హైవేపై రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనలు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఎస్సై సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాల నివారణ చేయవచ్చని తెలిపారు.