E.G: తాడితోట మోడల్ కెరీర్ సెంటర్లో జూన్ 6న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష తెలిపారు. మిరకల్ సాఫ్ట్వేర్, ఠాగూర్ సంస్థల్లోని ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని 10 నుంచి పీజీ వరకు అర్హతలు కలిగిన 19–40 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చు. ఆసక్తి గల వారు employment.ap.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.