పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామ పంచాయతీలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని శుక్రవారం జిల్లా పంచాయతీ శాఖ ఇంఛార్జ్ డీపీవో సువర్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్వతీపురం ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీ రాజ్ ప్రాముఖ్యతను వివరించారు.