KRNL: గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు పరిధిలోని ఎడమ కాలువ ద్వారా ఆయకట్టు పంటలకు నీటి విడుదలను ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు అధికారులు నిన్న తెలిపారు. మొదట మార్చి 31న నీటి సరఫరా నిలిపివేయాలని ఆదేశాలున్నా, అనివార్య కారణాల వల్ల ఎడమ కాలువకు నీటి విడుదలను మరో వారం పొడిగించారు. ప్రస్తుతం రోజుకు 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు.