WGL: MGM ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. రాయపర్తి మండలానికి చెందిన రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి మెడలో కణితి రావడంతో నిన్న MGM ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఆయన సర్జికల్ ఓపీలో చూపించుకుని అల్ట్రాసౌండ్ పరీక్ష కోసం దవాఖానలోని 92వ వార్డుకు వెళ్లాడు. అక్కడ సిబ్బంది పండుగ రోజున పరీక్ష చేయలేమని నిర్లక్ష్యంగా వ్యవహరించి, అతన్ని పంపించారు.